24, నవంబర్ 2015, మంగళవారం

నవ్యాంద్ర లో అన్ని ప్రాంతాలకు రైలు


న వ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అన్ని ప్రాంతాలనూ కలుపతూ సర్క్యూలర్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. కొన్ని రోజుల క్రితం గుంటూరు వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మెట్రోతో సమానంగా సర్క్యూ లర్ రైళ్లు నడిపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీ లించి వెంటనే నివేదిక పంపాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించడంతో ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది. ఈ మేరకు ప్రణాళికలు రూపొం దించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రాజధానికి తక్కువ సమయానికే చేరుకునేలా జాతీయ రహదా రులను అభివృద్ధి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే, మెట్రో " రైలుతో పాటు అన్ని ముఖ్య ప్రాంతాలను కలుపుతూ సర్క్యూలర్ రైళ్లు కూడా నడిపిస్తే ప్రస్తుతం గంటల సమయం పడుతున్న ప్రయాణం విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు జగ్గయ్యపేట తదితర ప్రాంతాల నుంచి అరగంటలోనే రాజధాని అమరావతికి చేరుకోవచ్చు * విజయవాడ, గుంటూరు నగర జనాభా ప్రస్తుతం సుమారు 25 లక్షల వరకు ఉండగా రాజధాని అయిన నేప థ్యంలో త్వరలోనే భారీ పరిశ్రమలు, కార్పొరేటర్ ఆస్ప త్రులు, వివిధ కంనెనీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాజ ధాని ప్రాంతానికి తరలిరానుండడంతో జనాభా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ నుంచి తెనాలి, గుంటూరు మీదగా సర్క్యూలర్ రైళ్లు నడుస్తుం డగా కొత్త రైల్వేస్టేషను ఏర్పాటు చేసి, రహదారి మార్గా నికి సమాంతరంగా రైలు అనుసంధానాన్ని పెంచితే ప్రయాణికులకు మరింత సౌలభ్యంగా మారడమే కాకుండా రాజధానికి నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. రాజధాని పరధిలో విజయవాడ జంక్షన్ నుంచి అమరా వతి, తుళూరు, కంచికచర్ల, జగ్గయ్యపేట, నందిగామ, మైల వరం, ఉ చల్లపల్లి, ఘంటశాల, మోపీదేవీ ప్రాంతాల్లో కొత్త రైలు మార్గం నిర్మిస్తే అనుసంధానం మరింత పెరుగుతుంది. ఈ మార్గాల్లో సర్క్యూలర్ రైళ్లు నడపడం ద్వారా విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి తక్కువ టికెట్టు ధరకే గంట వ్యవధిలోనే ఆయా ప్రాంతాలకు చేరు కోవచ్చు. దీంతో రైల్వే ఆదాయం కూడా గణనీయంగా పెరు గుతుందని పలువురు సూచిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, తెనాలి సర్కూలర్ రైళ్లకు గిరాకీ అధికంగా ఉంది హైదరాబాద్ ఎంఎంటీస్ తరహాలో ప్రతి గంటకూ విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి రాజధాని ప్రాంతాలకు రాకపోకలు సాగించేలా కొత్త మార్గాలు వేసి అన్ని ప్రాంతాలు కలుపతూ రైళ్లు నడిపితే ప్రయాణికులకు డబ్బులు తెదాతో పాటు సమయం కూడా చాలా వరకు కలిసి వస్తుంది. బస్సులతో పోలిస్తే సర్క్యూలర్ రైళ్ల టికెట్ల ధరలు చాలా తక్కువ కావ డంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఈ రైళ్లనే ఆశ్రయిస్తారు. రైల్వేకు కూడా గణనీయమైన ఆదాయం లభిస్తుంది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © 2014 అమరావతి కబుర్లు