22, నవంబర్ 2015, ఆదివారం

అమరావతి నగర అపురూప సంపద

అమరావతి నగర అపురూప సంపద

ఇది మన సంపద. మన దేశ సంపద. మన వారసత్వ సంపద. కోటలు, స్తూపాలు , పురాతన కట్టడాలు. ఇవన్నీ ఇది మన ఉమ్మడి ఆస్తి, వీటిని పరిరక్షిస్తూ, పరిశోధనల ద్వారా వాటి చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి అతి భద్రంగా కాపాడుకుంటూ నేటి తరాని నికి తెలియ చెప్పాలి
ఎంతో గొప్ప వారసత్వ సంపద మనకు ఉంది. అగ్రరాజ్యా లుగా వెలుగొందే అమెరికా వంటి వాటికి కేవలం 45 సంవత్సరాల చరిత్రే ఉంది నూరేళ్లు దాటిన కట్టడాలు, పురా తన స్థలాలు, చారిత్రక శిల్పాలు, శాసనాలు వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకునేలా యునెస్కో ప్రయత్నాలు చేస్తోంది. భారత దేశంలోని దేవాలయాలు వారత్వ సంపదలో చోటు దక్కించుకున్నాయి. మన దేశంలో కేవలం దేవాల యాలే కాక ఇంకా ఎన్నో కట్టడాలు వారసత్వ కట్టడం హోదా ను దక్కించుకున్నాయి. నిడమర్రులో వైకుంఠ నారాయణుడు మంగళగిరి మండలం నిడమర్రులో క్రీస్తుశకం 14వ శతాబ్దం నాటి వైకుంఠనారాయణుడి విగ్రహం, 12వ శతాబ్దం నాటి బుదుని విగ్రహం మౌన ముద్రలో ఒక ఇంటి ముందు ఉన్నాయి. వీటిని పట్టించుకునే నాథుడే లేడు. వైకుంఠపురంలో ఒక రోడుపై ఆరుగుపై క్రీ.శ9వ శతాబ్దం నాటి భూస్పర్శ బుదుడి విగ్రహం ఉంది. దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది మట్టి కొట్టుకుపోయింది. అ కొలనుకొండలో కనుమరుగైన సమాధులు విజయవాడ - గుంటూరుకు మార్గంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న కొలనుకొండలో శిలా యుగానికి చెందిన మాన వుల సమాధులు కనుమరుగయ్యాయి. అక్కడే ఉన్న చారిత్రక నిలయాలు ఎండకు ఎండి, వానకు తడుస్తున్నాయి. జైన మతానికి చెందిన కుందనుకుందాచార్యుని ఆరామంగా ఉన్న స్థానం అక్కడ ఉందన్న సంగతి పురావస్తు శాఖ వారికి తెలి యదంటే అతిశయోక్తి కాదు. మైలవరం పంగిడికొండపై బౌద్ధారామం కృష్ణా జిల్లా మైలవరం సమీపంలో పంగిడికొండపై బౌద్ధారామం ఉన్నట్లు తెనాలికి చెందిన వెంకటేశ్వరరావు అనే చరిత్రకారుడు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది క్రీ.శ. 1, 2 శతాబ్దాల నాటి బౌద్ధారామం, శిలా స్తంభాలు, శిల్ప శకలాలు, పెద్ద పెద ఇటుకరాళ్లు ఇక్కడ లభ్యయయ్యాయి. ఘంటసాలలో బౌద్ధ మహాచైత్యం ఘంటసాలలో శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలం నాటి బౌద్ధ చైత్యానికి మరమ్మతులు చేపట్టారు. ఇక్కడ ఉన్న పెద్ద దిబ్బ (బౌద్ధ సూపం)ను 1904లో అలెగ్జాండర్రే అనే చరిత్రకారుడు తవ్వకాలు చేపట్టి బుదుని వైశిష్యాన్ని వెలుగులోకి తీసుకొ చ్చారు. దీనికి సమీపంలో ఉన్న ఘోటకం దిబ్బ వద్ద తవ్వకా లలో బుదుడి పాలరాతి విగ్రహం, స్తంభాలు, శాసనాల రా తి ముక్కలు ఇలా ఎన్నో లభించాయి. ప్రస్తుతం వీటిలో కొన్ని ప్యారిస్, లండన్, పాండిచ్చేరి మ్యూజియంలలో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. విక్టోరియా మ్యూజియం విజయవాడలో ఉన్న విక్టోరియా మ్యూజియానికి వందేళ్ల
1881లో దీన్ని ప్రారంభిం చారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాషాలలో బయట పడిన అనేక వస్తువులు ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. వీటితో పాటు రాతి, శిలా యుగం నాటి మట్టి పాత్రలు, దంతపు ముక్కలు, శాసన లిపి పలకలు, రాత ప్రతులు, కత్తులు, శూలాలు, శవపేటిక, తాళపత్ర గ్రంధాలు, పురాతన నాణాలు ఎన్నో ఉన్నాయి. ప్రచారం లేక ఈ మ్యూజియం వెలవెలబోతోంది. eధనంబోడుగోడు పట్టేదెవరికి జగ్గయ్యపేటలోని ధనంబోడు బ్రిటీష్ కాలంలో జరిగిన తవ్వ కాల్లో బయట పడింది. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు బౌద్ధమతం ఈ ప్రాంతంలో పరిఢవిల్లిందనడానికి నిలువెత్తు సాక్ష్యంగా ఇక్కడ సూపం ఉంది. బ్రిటీష్ కాలంలో శిల్పాలు, నాణేలు, శాసనాలు లభించి నా అవి చెన్నై మ్యూజియంలో ఉన్నాయి. దీనికి సరైన ప్రచారం లేక సందర్శకులు రాక వెల వెలబోతోంది. పైన చెప్పకున్నవే కాకుండా రెండు జిల్లాలో వెలుగులోకి రానివి ఉన్నాయి. ఉండవల్లి గుహలకు పక్కనే ఉన్న పెనుమాక వెళ్లే దారిలో దాదాపు 100 ఎకరాల విస్తర్ణంలోని స్థలంలో బౌద్ధా రామ శిథిలాలు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
రాతియుగంనాటి మానవుల చరిత్ర
రాతియుగంలో మానవుడు నివసించిన గృహాలు మన చెంత నే ఉన్నాయన్న విషయం ఎవరికీ తెలియదు. ఇవి గ న్నవరానికి వెళ్లే దారిలో జాతీయ రహదారికి అనుకుని ఉ న్న కేసరిపల్లిలో బయటపడ్డాయి. 1960లో తవ్విన తవ్వ కాల్లో ఇవి బయట పడ్డాయి. తరువాత ఎవరు పట్టించుకోక పోవడంతో అక్రమ తవ్వకాల వల్ల మాయమయ్యాయి.
* సీతానగరంకొండ మీద ఇటీవల విష్ణుమూర్తి, గోవర్ణన పర తం ఎత్తిన కృష్ణుడి విగ్రహాలు లభ్యమయ్యాయి. ఇక్కడకొండ మీదకు ఘాట్ రోడును జీయర్ ఆశ్రమం వారు నిర్మిస్తున్నారు. * మంగళగిరికి వెళ్లే దారిలో ఉన్న ఎర్రపాలెంలోని తవ్వకాల్లో స్థానికులకు విగ్రహాలు దొరుకుతున్నాయి. సమాచారం అందినా పురావస్తు శాఖ అధికారులు అక్కడికి వెళ్లడానికి మీన మేషాలు లెక్కిస్తున్నారు • పిడుగురాళ్ల తదితర ప్రాంతాలలో బౌద్ధమతానికి సంబం దించిన ఆనవాళ్లు లభిస్తున్నాయి * ఇంద్రకీలాద్రి కొండ చుటూ దాదాపు 100కు పైగా శాసనా లు ఉన్నాయి. వీటన్నింటినీ ఒకేచోట చేరిస్తే భక్తులు, సందర్శ
అ కొండపల్లి ఖిల్లా సర్వేకొండ కింద మట్టిగోడ, కందకం
జిల్లాలో ఉన్న ఏకైక కోట కొండపల్లి ఖిల్లా, సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉంది. 1850లో ఆనవే మారెడ్డి అనే రాజు కొండకాపరి సూచనలపై నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 18 బురుజులు, కొండపైకి వచ్చే శత్రు సైనికులను అడుకోడానికి మానవ అవసరం లేకుండా రా ళ్లు విసిరే ఒక యంత్రం, రాజుగారి విహార మందిరం, రాణి మహల్, నర్తనశాల, రధాలు నడవడానికి మార్గం, గుర్రా లు, సైన్యం నడవడానికి కాలిబాట అబ్బో ఇంకా చాలా చెప్పుకోవచ్చు. శిథిలావస్థలో ఉన్న దీనిని బాగు చేయడానికి పురావస్తు శాఖ దాదాపు 15 సంవత్సరాల నుంచి కష్టప డుతోంది. కాని కొండ దిగువున ఉన్న మట్టిగోడ, దానికి అనుకుని ఉన్న కందకాన్నిపట్టించుకోకపోవడం వల్ల ఇవి అన్యాక్రాంతం అవుతున్నాయి. అవనిగడ్డ దగ్గర లక్ష్మీపురంలో ఏడో శతాబ్దం నాటి తెలుగు శాసనాల్లో మొట్టమొదటిగాలిపి, భాషాపరంగా గొప్పగా చెప్ప కునే శాసనం లభించింది. ఒకప్పుడు శాసన పరిశోధకులకు తెలిసిన ఇది కనిపించడం లేదు. • దివిసీమలో మాజేడులో లభించిన బుదుని దంత ధాతువును ఇక్కడి నుంచి శ్రీలంకకు తరలించే క్రమంలో కొంత కాలం చారి త్రక స్థలంగా వర్ధిల్లిందని బౌద్ధ సాహిత్యం ద్వారా తెలిసింది.. మన చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన పరావస్తు అవసరం అందరిపైనా ఉంది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © 2014 అమరావతి కబుర్లు