26, నవంబర్ 2015, గురువారం

భవనాల్లో పూర్తి స్థాయి భద్రతా


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో నిర్మించనున్న భవనాల్లో పూర్తి స్థాయి భద్రతా అంశాలు ఉండనున్నాయి. భవనాల్లో నివాసం ఉండే వారికి అత్యవసర సమయంలో కూడా ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా నిర్మించే ఆలోచనలో అ ధికారులు ఉన్నారు. భవన నిర్మాణ ప్రమా ణాలు తప్పనిసరిగా పాటించాలనే నిబం ధనను పక్కాగా అమలు చేయనున్నారు. వర్షపునీరు ఇంకిపోయేలా ఏర్పాట్లు ఈ ప్రాంతంలో నిర్మించే భవనాల మూలంగా ఏ ప్రాంతంలోనూ వర్షపు నీరు నిలిచిపోయేలా ఉండకుండా రూపొందించనున్నారు. భవనాల పక్కన చుట్టుపక్కన నిర్ణీత ప్రాంతంలో పచ్చదనం అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు సీఆర్డీఏ జారీచేసే అంశాలను ప్రస్తుతం పరిశీలిస్తోందని తెలిసింది. ఇదివరకే నిర్వహించిన ఓ సమావేశంలో ఈ అంశంపై విస్భ తంగా చర్చించారని, నిపుణులతో నిర్వహించే మలివిడత చర్చ ల అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్వస నీయంగా తెలిసింది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © 2014 అమరావతి కబుర్లు